ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి గాదె వెంకటరెడ్డి వయోభారంతో పాటు అనారోగ్య సమస్యలతో శనివారం స్వర్గస్తులయ్యారు. ఆయన అంత్యక్రియలు ఆదివారం, 31వ తేదీ ఉదయం 10 గంటలకు బాపట్ల జిల్లా ఇంకొల్లు మండలంలోని పావులూరు గ్రామంలో జరగనున్నట్లు ఆయన కుమారుడు, పర్చూరు నియోజకవర్గ వైఎస్ఆర్సిపి సమన్వయకర్త గాదె మధుసూదన్ రెడ్డి తెలిపారు. ఈ వార్తతో ఆయన అభిమానులు, రాజకీయ వర్గాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి.