ప్రకాశం జిల్లా కారంచేడు మండలం జలుబులవారిపాలెం గ్రామంలో ఆదివారం పేకాట ఆడుతున్నారన్న సమాచారంతో ఎస్సై ఖాదర్ బాషా తన సిబ్బందితో కలిసి దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో నలుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకుని, వారి వద్ద నుంచి 300 రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నారు. స్టేషన్ పరిధిలో అసాంఘిక కార్యకలాపాలు, పేకాట, కోడిపందాలు వంటి వాటిపై దృష్టి సారించినట్లు ఎస్సై తెలిపారు.