కారంచేడు మండలం స్వర్ణ గ్రామంలో సోమవారం తుఫాన్ ప్రభావంతో దెబ్బతిన్న పంట పొలాలను ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు అధికారులతో కలిసి పరిశీలించారు. పంట నష్ట నివేదికను వెంటనే అందజేయాలని అధికారులను ఆదేశించిన ఆయన, రైతులు ఆందోళన చెందవద్దని, ప్రభుత్వం నుంచి వచ్చే పరిహారం వెంటనే అందేలా చూస్తానని హామీ ఇచ్చారు. చంద్రబాబు నాయుడు రైతులకు అండగా ఉన్నారని పేర్కొన్నారు.