శుక్రవారం కారంచేడులోని గ్యాస్ గూడెం మలుపు వద్ద ఆటో, లారీ ఢీకొనడంతో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ దుర్ఘటనలో ఐదుగురు తీవ్రంగా గాయపడగా, ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. సమాచారం అందిన వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. క్షతగాత్రులను చీరాల ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నామని, పూర్తి వివరాలు తెలియాల్సి ఉందని తెలిపారు.