శనివారం మార్టూరులోని ఆదిజాంబో కాలనీలో ఎమ్మెల్యే సాంబశివరావు పర్యటించారు. ప్రజలతో నేరుగా మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. తుఫాను సమయంలో అండగా నిలిచినందుకు మహిళలు ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు. ఏ సమస్య వచ్చినా తన దృష్టికి తీసుకువస్తే వెంటనే పరిష్కరిస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.