పల్నాడు జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. ప్రేమజంట నాగార్జునసాగర్ కుడికాలువలో దూకి ప్రాణాలు తీసుకున్నారు. మాచర్లకు చెందిన వీర్ల గోవర్ధన్ యాదవ్ మరియు దాసరి శ్రీలక్ష్మి మృతులుగా గుర్తించారు. స్థానికులు సమాచారం అందుకున్న వెంటనే ఘటనాస్థలానికి చేరుకొని యువతి దేహాన్ని బయటకు తీశారు. యువకుడి కోసం పోలీసులు మరియు గ్రామస్థులు కలిసి గాలింపు చర్యలను కొనసాగిస్తున్నారు.