Jan 14, 2026, 14:01 IST/
జర్నలిస్టుల అరెస్టును ఖండిస్తున్నా: YS జగన్
Jan 14, 2026, 14:01 IST
హైదరాబాద్లో NTV జర్నలిస్టుల అరెస్టును వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. ఇది పత్రికా స్వేచ్ఛ, ప్రజాస్వామ్య విలువలపై ప్రత్యక్ష దాడిగా అభివర్ణించారు. అర్ధరాత్రి ఇళ్లలోకి చొరబడి, నోటీసులు ఇవ్వకుండా అరెస్టు చేయడం శోచనీయమని, జర్నలిస్టులు ఉగ్రవాదులు కాదని, ఇలాంటి చర్యలు మీడియాలో భయాన్ని సృష్టిస్తాయని ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వం రాజ్యాంగాన్ని గౌరవించి, పత్రికా స్వేచ్ఛను కాపాడాలని, అరెస్టు చేసిన వారిని వెంటనే విడుదల చేయాలని జగన్ డిమాండ్ చేశారు.