అమరావతి: బస్సు దిగుతుండగా జారిపడి బాలుడు గాయపడ్డాడు

2చూసినవారు
విజయవాడ నుంచి అమరావతికి వెళ్తున్న ఆర్టీసీ బస్సు పెద్దమద్దూరు డౌన్ వద్ద ప్రయాణికులు దిగేందుకు ఆగినప్పుడు ప్రమాదం జరిగింది. బస్సు అకస్మాత్తుగా ముందుకు కదలడంతో దిగుతున్న బాలుడు జారిపడి గాయపడ్డాడు. ఈ సంఘటనపై బాలుడి బంధువులు ఆందోళన వ్యక్తం చేస్తూ బస్సును అడ్డగించి డ్రైవర్‌ను మందలించినట్లు సమాచారం. ఈ ఘటనపై పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్