తుఫాన్‌ నష్టంపై ఏపీ ప్రభుత్వం ప్రాథమిక అంచనా

9చూసినవారు
తుఫాన్‌ నష్టంపై ఏపీ ప్రభుత్వం ప్రాథమిక అంచనా
ఏపీ ప్రభుత్వం మొంథా తుఫాన్‌ నష్టంపై ప్రాథమిక అంచనా వెల్లడించింది. మొత్తం రూ.5,265 కోట్ల నష్టం జరిగినట్లు తెలిపింది. ఇందులో వ్యవసాయ రంగంలో రూ.829 కోట్లు, హార్టికల్చర్‌లో రూ.39 కోట్లు, సెరికల్చర్‌లో రూ.65 కోట్లు, పశుసంవర్ధకశాఖలో రూ.71 లక్షలు, ఆక్వారంగంలో రూ.1,270 కోట్లు, మున్సిపల్‌ శాఖలో రూ.109 కోట్లు, హౌసింగ్‌లో రూ.5.53 కోట్లు నష్టం జరిగింది. ఆర్‌అండ్‌బీ విభాగానికి అత్యధిక నష్టం జరిగినట్లు సీఎం చంద్రబాబు తెలిపారు.