పెదకూరపాడు నియోజకవర్గంలో శుక్రవారం బక్రీద్ పండుగను ముస్లిం సోదరులు ఘనంగా జరుపుకున్నారు. నియోజకవర్గ కేంద్రంలో బస్టాండ్ సెంటర్ నుంచి రైల్వే స్టేషన్ లోని ఈద్గా వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. 'అల్లాహ్ అక్బర్' నినాదాలతో ఈద్గా వద్ద ప్రత్యేక ప్రార్థనలు చేసి, సామూహిక నమాజ్ లో పాల్గొన్నారు. పరస్పరం శుభాకాంక్షలు తెలుపుకుంటూ పండుగను ఆనందోత్సాహాలతో జరుపుకున్నారు.