ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ మాట్లాడుతూ, గ్రామీణ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిని లక్ష్యంగా పెట్టుకుని కూటమి ప్రభుత్వం ముందుకు వెళ్తుందని తెలిపారు. ప్రజలకు ఆమోదయోగ్యమైన సంస్కరణలను అమలు చేస్తున్నామని, ప్రజల సమస్యలకు పరిష్కారం చూపుతూ, పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యత ఇస్తూ, ఇచ్చిన హామీలను నెరవేర్చే దిశగా పరిపాలన కొనసాగుతోందని పేర్కొన్నారు. 'పల్లె పండగ 2.0' కార్యక్రమం ద్వారా గ్రామాల్లో రెట్టింపు అభివృద్ధి లక్ష్యాలను సాధించేందుకు చర్యలు చేపట్టామని, మౌలిక వసతుల అభివృద్ధి, పరిశుభ్రత, హరిత కార్యక్రమాలతో గ్రామీణ ప్రాంతాల్లో సమగ్ర మార్పు తీసుకురావడమే ప్రభుత్వ లక్ష్యమని వివరించారు. ఐదు జిల్లాల్లో 'అమరజీవి జలధారలు' కార్యక్రమం ద్వారా నీటి వనరుల సంరక్షణ, భూగర్భ జలాల పెంపు, సాగునీటి లభ్యత మెరుగుపరిచే చర్యలు రైతులకు స్థిరమైన ప్రయోజనం చేకూరుస్తాయని తెలిపారు.