పెదకూరపాడులో యానిమేటర్లకు స్మార్ట్‌ఫోన్ల పంపిణీ

4చూసినవారు
పెదకూరపాడులో యానిమేటర్లకు స్మార్ట్‌ఫోన్ల పంపిణీ
పెదకూరపాడు మండలం తాళ్లూరులో మంగళవారం, యానిమేటర్లకు ప్రభుత్వం అందించిన స్మార్ట్‌ఫోన్లను ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ పంపిణీ చేశారు. నియోజకవర్గం వ్యాప్తంగా మొత్తం 187 మందికి ఫోన్లు అందజేశారు. డ్వాక్రా రుణాలను మహిళలు సమర్థంగా వినియోగించుకునేలా యానిమేటర్లు చురుకుగా పనిచేయాలని, ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హుల వరకు చేరేలా కృషి చేయాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, అధికారులు పాల్గొన్నారు.