పులిచింతల ప్రాజెక్టులోకి శుక్రవారం నాటికి 1.88 లక్షల క్యూసెక్కుల వరద నీరు చేరుతోంది. ఈఈ గుణకర్ రావు తెలిపిన వివరాల ప్రకారం, ప్రాజెక్టు నుంచి 97 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టులోని 4 గేట్లను 4 మీటర్ల మేర ఎత్తి నీటిని విడుదల చేసినట్లు ఆయన వివరించారు. ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు చేరుతుండటంతో ఈ చర్యలు చేపట్టారు.