అమరావతి అభివృద్ధిపై మంత్రి నారాయణ కీలక వ్యాఖ్యలు

9చూసినవారు
అమరావతి అభివృద్ధిపై మంత్రి నారాయణ కీలక వ్యాఖ్యలు
బుధవారం గుంటూరు కలెక్టరేట్‌లో అమరావతి అభివృద్ధి పనులపై ఏపీ మంత్రి నారాయణ అధికారులతో సమీక్ష నిర్వహించారు. భూముల విలువ పెంచడానికి పరిశ్రమలు, విమానాశ్రయం అవసరమని, అందుకే రెండో విడత భూసమీకరణ చేపట్టాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశించారని మంత్రి తెలిపారు. ఈ సమావేశంలో తాడికొండ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్, పెదకూరపాడు ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్, గుంటూరు కలెక్టర్ తమీమ్ అన్సారియా, పల్నాడు కలెక్టర్ కృతికా శుక్లా పాల్గొన్నారు. పలు కీలక అంశాలపై చర్చించి, అధికారులకు మంత్రి ఆదేశాలు జారీ చేశారు.

సంబంధిత పోస్ట్