బెల్లంకొండ మండలం నాగిరెడ్డిపాలెం గ్రామానికి చెందిన సుమారు 80 కుటుంబాలు పులిచింతల ప్రాజెక్టు పరివాహక ప్రాంతంలోని కృష్ణానదిలో చేపల వేట చేస్తుండగా, కొందరు అడ్డంకులు సృష్టిస్తున్నారని ఆరోపించారు. 2014-15 నుండి మత్స్యకార శాఖ లైసెన్సులు, వలలు, సైకిళ్లు, ఐస్ బాక్సులు అందించినప్పటికీ, కొంతమంది తమను బెదిరిస్తూ, గుడిసెలు తొలగిస్తామని దూషణలకు దిగుతున్నారని బాధితులు పేర్కొన్నారు. భవిష్యత్తులో చేపల వేట కొనసాగించేందుకు చర్యలు తీసుకోవాలని అదనపు ఎస్పీని కలిసి ఫిర్యాదు చేశారు.