పెదకూరపాడులో శనివారం సాయంకాలం స్థానిక రైల్వే స్టేషన్ సమీపంలో వాహనాల తనిఖీ నిర్వహించారు. సరైన పత్రాలు లేని వాహనదారులకు అపరాధ రుసుము వసూలు చేశారు. ఈ సందర్భంగా ఎస్సై అల్లు రెడ్డి మాట్లాడుతూ, మద్యం సేవించి వాహనాలు నడపడం ద్వారా జీవితాలను నాశనం చేసుకోవద్దని, ద్విచక్ర వాహనాలపై ప్రయాణించేటప్పుడు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని సూచించారు.