గురుకుల పాఠశాలలో పూర్వవిద్యార్థుల ఆత్మీయ సమ్మేళనానికి సన్నాహాలు

11చూసినవారు
గురుకుల పాఠశాలలో పూర్వవిద్యార్థుల ఆత్మీయ సమ్మేళనానికి సన్నాహాలు
పల్నాడు జిల్లా అచ్చంపేట బాలుర గురుకుల పాఠశాలలో పూర్వవిద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం కోసం ఏర్పాట్లు ప్రారంభమయ్యాయి. బుధవారం నాడు పూర్వవిద్యార్థులు రాజేష్, సాగర్, బుజ్జి, సురేష్, నల్లయ్య, అంజి, హనుమంతురావు ప్రిన్సిపాల్ కె. వెంకటేశ్వర్లుని కలిసి చర్చించారు. సమ్మేళనం కార్యక్రమాలు, అవసరమైన ఏర్పాట్లు, పాఠశాల అభివృద్ధికి చేపట్టాల్సిన చర్యలపై చర్చ జరిగింది. సమ్మేళనం విజయవంతం అయ్యేలా పూర్వవిద్యార్థుల సహకారం ఉంటుందని కమిటీ సభ్యులు తెలిపారు.

సంబంధిత పోస్ట్