ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ చేపట్టిన “100 రోజులు–100 గ్రామాలు” కార్యక్రమంలో భాగంగా మంగళవారం అచ్చంపేట మండలం మాదిపాడు గ్రామంలో పర్యటించారు. ప్రజల సమస్యలను తెలుసుకున్న ఆయన, గ్రామ సమగ్ర అభివృద్ధికి రూ. 16 కోట్లు కేటాయించినట్లు తెలిపారు. రోడ్లు, డ్రైనేజీలు, తాగునీటి వంటి మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యత ఇస్తామని, పెండింగ్ సమస్యలను త్వరగా పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ప్రజలకు మెరుగైన సదుపాయాలు కల్పించడమే లక్ష్యమని స్పష్టం చేశారు.