ఆదివారం, బీజేపీ అధిష్టానం ఆంధ్రప్రదేశ్ శాసనమండలిలో తమ ఫ్లోర్ లీడర్‌గా ఎమ్మెల్సీ సోము వీర్రాజును ఎంపిక చేసినట్లు ప్రకటించింది. ఈ ఏడాది మార్చిలో జరిగిన ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీకి కేటాయించిన ఒక సీటుకు సోము వీర్రాజు అనూహ్యంగా ఎన్నికయ్యారు. గతంలో పీవీఎన్ మాధవ్‌ను ఎంపిక చేస్తారనే ప్రచారం జరిగినా, చివరి నిమిషంలో సోము వీర్రాజు పేరు తెరపైకి వచ్చింది. వైసీపీ, టీడీపీలకు శాసనమండలిలో ఫ్లోర్ లీడర్లు ఉండగా, బీజేపీకి ఈ పదవి లేకపోవడంతో సోము వీర్రాజు నియామకం జరిగింది.