బెల్లంకొండ గ్రామ శివారులోని భీముని దిబ్బ కొండ అడవి ప్రాంతంలో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యం కావడం స్థానికంగా కలకలం రేపింది. సుమారు 50 ఏళ్ల వయస్సు గల ఈ మృతదేహం దాదాపు 15 రోజుల క్రితం మృతి చెందినట్లు పోలీసులు ప్రాథమికంగా అనుమానిస్తున్నారు. అడవిలో గొర్రెలు మేపుతున్న కాపరులు మృతదేహాన్ని గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలనలు చేపట్టి, మృతుడి వివరాల గుర్తింపుతో పాటు కేసుపై దర్యాప్తు కొనసాగిస్తున్నారు.