అమరావతి రాజధాని ప్రాంతంలో అభివృద్ధి పనుల పేరుతో భారీగా అక్రమాలు జరుగుతున్నాయని వైసీపీ ఆరోపించింది. కంపల తొలగింపు పనులకే రూ. 40 కోట్లకు పైగా కేటాయించి అధికార పార్టీకి అనుబంధంగా ఉన్న కాంట్రాక్టర్లకు లబ్ధి చేకూరుస్తున్నారని విమర్శించింది. "ప్రజల డబ్బును అభివృద్ధి పేరుతో దోచుకుంటున్నారు" అని మండిపడిన వైసీపీ, రాజధాని పనుల్లో కూటమి నేతల మధ్య వాటాల రాజకీయాలు నడుస్తున్నాయని ఎద్దేవా చేసింది.