
గుంటూరు తూర్పు పరిశీలకులుగా డా. రూత్ రాణి
వైయస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు, పొన్నూరు మాజీ మున్సిపల్ చైర్మన్ డాక్టర్ రూత్ రాణిని గుంటూరు తూర్పు అసెంబ్లీ నియోజకవర్గం పరిశీలకురాలిగా నియమించినట్లు తాడేపల్లిలోని వైయస్సార్సీపీ కేంద్ర కార్యాలయం శుక్రవారం ప్రకటించింది. ఈ నియామకంపై పలువురు వైయస్సార్సీపీ నాయకులు రూత్ రాణిని అభినందించారు. క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేయడానికి తన వంతు కృషి చేస్తానని ఆమె మీడియాకు తెలిపారు.





































