Jan 12, 2026, 10:01 IST/పెద్దపల్లి
పెద్దపల్లి
సంక్రాంతికి ఊరెళ్లేవారు అప్రమత్తం: పెద్దపల్లి పోలీసులు
Jan 12, 2026, 10:01 IST
సంక్రాంతి పండుగ సందర్భంగా ఊరెళ్లే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పెద్దపల్లి పోలీసులు సూచించారు. ఇళ్లకు తాళాలు వేసే ముందు తలుపులు, కిటికీలు సరిగా మూశారో లేదో చూసుకోవాలని, సీసీ కెమెరాలు పనిచేసేలా చూసుకోవాలని తెలిపారు. అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే 100 లేదా 112కు సమాచారం ఇవ్వాలని ప్రజలకు సూచించారు. ఈ మేరకు పట్టణంలో ఆటో ద్వారా మైకులో విస్తృత ప్రచారం నిర్వహించి ప్రజలను చైతన్య పరిచారు.