చేబ్రోలు మండలం శేకూరు గ్రామ వైస్ సర్పంచ్ యార్లగడ్డ సుబ్బారావు మంగళవారం అనారోగ్యంతో మృతి చెందారు. పొన్నూరు నియోజకవర్గ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త అంబటి మురళీకృష్ణ ఆయన భౌతికకాయానికి నివాళులర్పించి, కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఈ సందర్భంగా మురళీకృష్ణ మాట్లాడుతూ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక ముఖ్యమైన కార్యకర్తను కోల్పోయిందని, వారి కుటుంబ సభ్యులకు పార్టీ అండగా ఉంటుందని తెలిపారు. పలు అనుబంధ విభాగాల నాయకులు, కార్యకర్తలు కూడా పాల్గొని నివాళులర్పించారు.