
ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు కర్ణాటక వాసులు మృతి
TG: వనపర్తి జిల్లా కొత్తకోట మండల పరిధిలోని ముమ్మల్లపల్లి వద్ద జాతీయ రహదారిపై శుక్రవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కర్ణాటకకు చెందిన కొందరు వ్యక్తులు బొలేరో వాహనంలో ప్రయాణిస్తుండగా, వెనుక నుంచి అతివేగంగా వచ్చిన లారీ వారి వాహనాన్ని బలంగా ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే మృతిచెందారు. ప్రమాదానికి కారణమైన లారీ డ్రైవర్‌పై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.




