చేబ్రోలు మండలం బుడంపాడు–నారాకోడూరు ప్రధాన రహదారిపై ఆదివారం కారు, బైక్ ఢీకొని ప్రమాదం జరిగింది. గుంటూరు వస్తున్న కారు నారాకోడూరు వైపు వెళ్తున్న బైక్‌ను ఢీకొట్టింది. కారు ఎయిర్‌బ్యాగ్స్ తెరుచుకోవడంతో అందులో ఉన్నవారు సురక్షితంగా బయటపడ్డారు. అయితే, బైకర్‌కు తలకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు అతన్ని బుడంపాడు వాసిగా గుర్తించి, అంబులెన్స్‌లో ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనతో కొద్దిసేపు ట్రాఫిక్ జామ్ అయింది.