పొన్నూరులో రేషన్ డీలర్ పై కేసు నమోదు

7చూసినవారు
పొన్నూరులో రేషన్ డీలర్ పై కేసు నమోదు
పొన్నూరు పట్టణంలోని చౌక ధరల దుకాణం నంబర్ 0788001 ను శుక్రవారం గుంటూరు విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు ఆకస్మికంగా తనిఖీ చేశారు. 12,770 కిలోల పిడిఎఫ్ ఫార్టిఫైడ్ రైస్ నిల్వ ఉండాల్సి ఉండగా, కేవలం 100 కిలోలు మాత్రమే నిల్వ ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఈ క్రమంలో, డీలర్ చిలకా వెంకట రమణపై 6A కేసు నమోదు చేశారు. ఈ తనిఖీలో విజిలెన్స్ ఇన్స్పెక్టర్ కె. చంద్రశేఖర్, తహసిల్దార్ ఎం. లక్ష్మీ మాధవి, సైదులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్