
డీఈఈసెట్ 2026 ఫలితాలు విడుదల
TG: రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు డీఈడీ కాలేజీల్లో డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించిన టీజీ డీఈఈసెట్ 2026 ఫలితాలు విడుదలయ్యాయి. మే 21న జరిగిన ఈ పరీక్షకు 35,592 మంది దరఖాస్తు చేసుకోగా, 25,054 మంది హాజరయ్యారు. వీరిలో 21,137 మంది అర్హత సాధించారు., 84.36% ఉత్తీర్ణత నమోదైంది. ఎంపికైన అభ్యర్థులకు జూన్ 2 నుంచి 5 వరకు సర్టిఫికెట్ ధ్రువీకరణ, జూన్ 6 నుంచి 8 వరకు వెబ్ ఆప్షన్ల ప్రక్రియ కొనసాగనుంది.




