పొన్నూరు పురపాలక సంఘ కమిషనర్ ముప్పాళ్ళ రమేష్ బాబు బుధవారం పట్టణంలోని పలు వార్డుల్లో పర్యటించారు. జయభరత్ నగర్, 12వ వార్డులో ప్రజలు సిసి రోడ్లు లేక రాకపోకలకు ఇబ్బందులు పడుతున్నారని కమిషనర్ దృష్టికి తీసుకువచ్చారు. వారి అభ్యర్థన మేరకు సిసి రోడ్ల నిర్మాణం కోసం ఆ ప్రాంతాన్ని పరిశీలించి, తదుపరి చర్యలకు సంబంధిత అధికారులకు సూచనలు అందజేశారు. ఈ కార్యక్రమంలో శానిటరీ ఇన్స్పెక్టర్ పి. పోతురాజు, మున్సిపల్, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.