పొన్నూరు నిడుబ్రోలులోని 8వ వార్డులో మొన్నటి తుఫాన్ కారణంగా నిలిచిపోయిన వరద నీటితో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నీరు పోవడానికి మార్గం లేకపోవడంతో విద్యార్థులు కూడా కష్టాలు ఎదుర్కొంటున్నారు. ఇన్ని రోజులు గడిచినా నీరు తగ్గకపోవడంతో దోమల బెడద పెరిగి, మలేరియా, విషజ్వరాలు వచ్చే ప్రమాదం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సంబంధిత అధికారులు స్పందించి, తమ సమస్యను పరిష్కరించాలని వారు కోరుతున్నారు.