గుంటూరు జిల్లా పెదకాకాని గ్రామంలో బుధవారం నాలుగేళ్ల బాలిక శిరీష తోటి స్నేహితులతో ఆడుకుంటూ అనుకోకుండా రబ్బరు బూరను మింగడంతో ఊపిరాడక మృతి చెందింది. బంధువులు వెంటనే ఆమెను గుంటూరు జీజీహెచ్‌కు తరలించగా, అప్పటికే బాలిక మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ఈ ఘటనతో గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది.