శనివారం పెదకాకాని మండలం కొప్పురావూరు శివారులో ఒక మహిళ మెడలోని బంగారు గొలుసును గుర్తుతెలియని వ్యక్తి అపహరించాడు. టీవీఎస్ ఎక్సెల్‌పై వెళ్తున్న సీతమ్మ మెడలోని గొలుసును ద్విచక్ర వాహనంపై వచ్చిన ముసుగు ధరించిన వ్యక్తి లాక్కొని పరారయ్యాడు. బాధితుల ఫిర్యాదుతో పెదకాకాని పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.