గుంటూరు జిల్లా తక్కెళ్లపాడులో నూతనంగా నిర్మించిన లలితా పీవీఎస్ ఆస్పత్రిని బుధవారం నారా చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. గ్రామీణ ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని, ఆరోగ్య రంగంలో మౌలిక సదుపాయాలను బలోపేతం చేయడానికి ప్రభుత్వం కృషి చేస్తోందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో సత్య కుమార్ యాదవ్, ధూళిపాళ్ళ నరేంద్ర కుమార్, అధికారులు, ఆస్పత్రి ప్రతినిధులు పాల్గొన్నారు.