
ఆదరణ-3 పథకానికి రూ. 1,000 కోట్లు వెచ్చించబోతున్నాం: మంత్రి సవిత
AP: విజయవాడలో సోమవారం మీడియా ప్రెస్ మీట్లో మాట్లాడిన బీసీ సంక్షేమశాఖ మంత్రి సవిత.. ఆదరణ-3 పథకం అమలుకు సిద్ధమవుతున్నట్లు తెలిపారు. ఈ పథకానికి రూ.1,000 కోట్లు వెచ్చించబోతున్నామని ఆమె వెల్లడించారు. త్వరలో ఈ పథకం ప్రారంభమవుతుందని పేర్కొన్నారు. ఆదరణ-3 అమలుపై బీసీ కార్పొరేషన్ ఛైర్మన్లు, డైరెక్టర్లతో వర్క్‌షాప్ నిర్వహించనున్నట్లు మంత్రి తెలిపారు.




