గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం వేజెండ్ల గ్రామంలో ఆదివారం రాత్రి పొన్నూరు వైసిపి సమన్వయకర్త అంబటి మురళీకృష్ణ ఆధ్వర్యంలో రచ్చబండ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా, టిడిపికి చెందిన ఎంపీటీసీ షేక్ బాషా నేతృత్వంలో 20 కుటుంబాలు వైఎస్ఆర్సిపిలో చేరాయి. అంబటి మురళీకృష్ణ వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించి, పార్టీని బలోపేతం చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వైసిపి శ్రేణులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.