చేబ్రోలు గ్రామ పంచాయతీలోని కొత్తరెడ్డిపాలెంలో కోతుల బెడద తీవ్రంగా ఉండటంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఈ సమస్యను అధికారులు దృష్టికి తీసుకురాగా, డిప్యూటీ ఎంపీడీవో రవిశంకర్ ఆదేశాల మేరకు సోమవారం పంచాయతీ కార్యదర్శి కారసాల శ్రీనివాసరావు, చింపాంజీ వేషధారణలో ఒక వ్యక్తిని గ్రామంలో నియమించారు. ఇది సత్ఫలితాన్నిస్తే కోతుల బెడద నివారించవచ్చని కార్యదర్శి తెలిపారు. ఈ చర్య ప్రజల భయాన్ని తగ్గించి, కోతుల సమస్యకు పరిష్కారం చూపుతుందని ఆశిస్తున్నారు.