పొన్నూరు: మతసామరస్యానికి ప్రతీక అమీన్ పీర్ పెద్ద దర్గా

0చూసినవారు
పొన్నూరు: మతసామరస్యానికి ప్రతీక అమీన్ పీర్ పెద్ద దర్గా
కడపలోని ప్రసిద్ధ అమీన్ పీర్ పెద్ద దర్గా పీఠాధిపతి శ్రీ శ్రీ శ్రీ ఖ్వాజా సయ్యద్ షా పీరుల్లా మహమ్మదుల్ హుస్సైనీ 10వ జన్మదిన వేడుకలు బుధవారం పొన్నూరు పట్టణంలో వారి శిష్య బృందం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా, పట్టణంలోని వృద్ధాశ్రమాలు, ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్న వృద్ధులకు పాలు, పండ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పొన్నూరు ఫ్రంట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్షుడు తోట రాంబాబు, శిష్య బృందం పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్