పొన్నూరు: విద్యార్థులకు సంకల్పం పై అవగాహన కార్యక్రమం

13చూసినవారు
పొన్నూరు: విద్యార్థులకు సంకల్పం పై అవగాహన కార్యక్రమం
గుంటూరు జిల్లా ఎస్పీ వసూల్ జిందాల్ ఆదేశాల మేరకు, బుధవారం పొన్నూరులోని శ్రీ వెంకటేశ్వర కళాశాలలో అర్బన్ సీఐ వీరానాయక్ ఆధ్వర్యంలో 'సంకల్పం' కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో విద్యార్థులకు గంజాయి, మత్తు పదార్థాలు, సైబర్ నేరాలపై అవగాహన కల్పించారు. చెడు వ్యసనాలకు దూరంగా ఉండి విద్యకు ప్రాధాన్యత ఇవ్వాలని సీఐ వీరానాయక్ సూచించారు. ఈ కార్యక్రమంలో ఎస్సై లక్ష్మి, అధ్యాపక బృందం పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్