పొన్నూరు పట్టణంలోని సెయింట్ థామస్ ఇంగ్లీష్ మీడియం హైస్కూల్లో మంగళవారం ఎస్ఎస్ డెంటల్ కేర్ ఆధ్వర్యంలో డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి కనుమర్లపూడి దంత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ శిబిరంలో సుమారు 500 మంది విద్యార్థులకు పరీక్షలు నిర్వహించగా, 220 మందికి దంత వైద్యం అవసరమని గుర్తించారు. విద్యార్థులకు దంత వ్యాధులపై అవగాహన కల్పించారు. పాఠశాల సిబ్బంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.