ఈ నెల 5వ తేదీన చేబ్రోలు మండలం నారాకోడూరు జడ్పీ పాఠశాలలో నిర్వహించనున్న మెగా పేరెంట్స్ డే కార్యక్రమానికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హాజరుకానున్నారు. ఈ నేపథ్యంలో, పాఠశాలలోని మౌలిక వసతులు, ఏర్పాట్లను మెరుగుపరిచేందుకు సబ్ కలెక్టర్ సంజనాసింహ బుధవారం పాఠశాలను సందర్శించి, అధికారులకు పలు ఆదేశాలు జారీ చేశారు. కార్యక్రమం విజయవంతం అయ్యేలా కృషి చేయాలని సూచించారు.