పొన్నూరు పట్టణం నిడుబ్రోలు గోతాల స్వామి ఆశ్రమంలో శనివారం వివేక్ ఫౌండేషన్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో అనాథలకు ఉచిత వైద్య సేవలు అందించారు. ఈ సందర్భంగా వారికి బట్టలు, పోషకాహార పదార్థాలు కూడా పంపిణీ చేశారు. సమాజంలో నిర్లక్ష్యానికి గురైన వర్గాలకు ఆశ, ఆదరణ అందించడమే తమ లక్ష్యమని ట్రస్ట్ సభ్యులు తెలిపారు. ఈ కార్యక్రమంలో వందమంది నిరాశ్రయులకు సహాయం అందించారు.