గుంటూరు జిల్లా వ్యవసాయ అధికారి ఐత నాగేశ్వరరావు, ఉద్యాన పరిశోధన కేంద్రం అధిపతి సివి రమణ శుక్రవారం పెదకాకాని మండలం నంబూరు గ్రామంలో మినుము, మిరప పంటలను పరిశీలించారు. 900 ఎకరాల మినుము పంట నష్టం జరిగిందని త్వరితగతిన అంచనాలు తయారు చేయాలని సిబ్బందిని ఆదేశించారు. పంటలో నీటి నిల్వలను గట్లు తెగ కొట్టి బయటకు పంపే చర్యలు చేపట్టాలని రైతులకు సూచించారు. వ్యవసాయ అధికారుల సూచనలు పాటించాలని కోరారు.