ఈనెల 26వ తేదీన జరిగే రాజ్యాంగ పరిరక్షణ సభను జయప్రదం చేయాలని మాల మహాసభ రాష్ట్ర అధ్యక్షులు మల్లెల వెంకట్రావు పిలుపునిచ్చారు. పొన్నూరు అంజుమన్ కమిటీ ఆధ్వర్యంలో ఆదివారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, భారత రాజ్యాంగంలో రోజుకో కొట్టివేతలు మానవ హక్కుల ఉల్లంఘనకు దారితీస్తున్నాయని, కాబట్టి రాజ్యాంగ పరిరక్షణకై అన్ని వర్గాలు ఏకతాటిపైకి రావాలని కోరారు. ఈ సమావేశంలో అంజుమాన్ కమిటీ ప్రెసిడెంట్ మగ్బుల్ బేగ్, మైనారిటీ నాయకులు షేక్ ఫిరోజ్, షేక్ బాజీ, దళిత, ముస్లిం మైనారిటీ నాయకులు పాల్గొన్నారు.