పొన్నూరు మండలం మన్నవ గ్రామ రైతు సేవ కేంద్రం సిబ్బందిపై ఎంపీడీవో చంద్రశేఖర రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం సచివాలయంలో నిర్వహించిన సమీక్షలో, రైతులకు సిబ్బంది అందుబాటులో ఉండటం లేదని గ్రామస్తుల ఫిర్యాదు మేరకు ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. సిబ్బందిపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని, సమయపాలన పాటిస్తూ రైతులకు అందుబాటులో ఉండాలని ఆయన ఆదేశించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మాల కార్పొరేషన్ డైరెక్టర్ బి. బాబురావు కూడా పాల్గొన్నారు.