శ్రీరంగపురం 25 బ్రాంచ్ నెంబర్ మురుగు కాలువలో పిచ్చి మొక్కలు పేరుకుపోయి, వరద నీరు నిలిచిపోయి పొలాలు ముంపునకు గురవుతున్నాయని రైతు చెన్నయ్య శనివారం ఆవేదన వ్యక్తం చేశారు. నాలుగు రోజులుగా అధికారుల చుట్టూ తిరుగుతున్నా పట్టించుకోవడం లేదని, కాలువలో గుర్రపు డెక్క తొలగిస్తే నీరు బయటకు వెళ్తుందని, అధికారులు స్పందించాలని ఆయన కోరారు.