రాష్ట్రంలోని వ్యాయామ కళాశాలల్లో ప్రవేశాల కోసం నిర్వహించే పీసెట్ పరీక్షలు బుధవారం నుంచి ఏఎన్యూలో ప్రారంభం కానున్నాయి. పరీక్షల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని కన్వీనర్ ఆచార్య పాల్ కుమార్ తెలిపారు. నాలుగు రోజుల పాటు హాల్‌టికెట్ నంబర్ల వారీగా పోటీలు నిర్వహించనున్నారు. పురుషులకు 100, 800 మీటర్ల పరుగు, షాట్‌పుట్, లాంగ్ జంప్ లేదా హైజంప్‌తో పాటు నిర్దేశిత క్రీడలో పరీక్షలు జరగనున్నాయి. మహిళలకు 100, 400 మీటర్ల పరుగు, షాట్‌పుట్, హైజంప్ లేదా లాంగ్ జంప్, నిర్దేశిత క్రీడలో పోటీలు నిర్వహించనున్నట్లు అధికారులు వెల్లడించారు.