పొన్నూరు: కవి రహీం సాహెబ్ సత్కారం

31చూసినవారు
పొన్నూరుకు చెందిన ఆర్టీసీ కండక్టర్, కవి, గాయకుడు షేక్ రహీం సాహెబ్ కు శనివారం రోటరీ ఇంటర్నేషనల్ పురస్కారం లభించింది. తెలుగు సాహిత్య, సాంస్కృతిక రంగాలకు ఆయన అందిస్తున్న సేవలకు గుర్తింపుగా రోటరీ ఇంటర్నేషనల్ క్లబ్ గవర్నర్ రాంప్రసాద్ ఈ పురస్కారాన్ని అందజేశారు. కళా రంగానికి ఆయన చేస్తున్న సేవలను గవర్నర్ కొనియాడారు. ఈ కార్యక్రమంలో రోటరీ, ఆర్టీసీ సభ్యులు రహీం సాహెబ్ ను అభినందించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్