ప్రఖ్యాతిగాంచిన కడప అమీన్ పీర్ దర్గా ఉరుసు మహోత్సవం పోస్టర్ ను పొన్నూరులో గురువారం ప్రముఖ వ్యాపారవేత్త షేక్ అబ్దుల్ ఖధిర్, కడప దర్గా స్వామివారి భక్తులతో కలిసి ఆవిష్కరించారు. వచ్చేనెల నవంబర్ 5వ తేదీన గంధ మహోత్సవం, 6వ తేదీన ఉరుసు మహోత్సవం ఘనంగా జరుగుతాయని తెలిపారు. ఈ కార్యక్రమాలలో స్వామివారి భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.