పొన్నూరు: దుర్గంధం వెదజల్లుతున్న ప్రధాన రహదారి

11చూసినవారు
పొన్నూరులోని గుంటూరు బస్ బస్టాండ్ వెనకాల రోడ్డులో ఉన్న టాయిలెట్ నుండి వ్యర్థ నీరు ప్రవహించి ఆ ప్రాంతమంతా దుర్గంధ భరితంగా మారిందని స్థానికులు, దుకాణదారులు శనివారం మీడియాకు తెలిపారు. ఈ రోడ్డులో ప్రయాణించే వారు ముక్కు మూసుకొని నడవాల్సి వస్తుందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా మున్సిపల్ ఉన్నతాధికారులు తక్షణమే స్పందించి ఈ సమస్యను పరిష్కరించాలని వారు వేడుకుంటున్నారు.

ట్యాగ్స్ :