పొన్నూరు మండలంలోని మామిళ్లపల్లి గ్రామంలో సోమవారం బూత్ లెవల్ ఏజెంట్ల (బీఎల్ఏ) ప్రత్యేక సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఓటర్ల జాబితా పరిశీలన, కొత్త ఓటర్ల నమోదు, మార్పులు-చేర్పుల ప్రక్రియపై ఏజెంట్లకు అవగాహన కల్పించారు. బూత్ స్థాయిలో పార్టీని బలోపేతం చేయడానికి చేపట్టాల్సిన చర్యలపై నాయకులు దిశానిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, కార్యకర్తలు, బీఎల్ఏలు పాల్గొన్నారు.